బుల్లితెరలో సీరియళ్లు చూసేవారికి షాక్ – కరోనా ఎఫెక్ట్

బుల్లితెరలో సీరియళ్లు చూసేవారికి షాక్ - కరోనా ఎఫెక్ట్

0
76

కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి ఎక్కడ చూసినా వేలాది కేసులు వస్తున్నాయి.. దీంతో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ కొత్త సినిమాలు ఏవీ కూడా విడుదల అవ్వడం లేదు.. వాయిదా వేసుకున్నారు. అయితే సినిమాలే కాదు ఇటు షూటింగులు ఆగిపోయాయి, ఇక కొత్త సినిమాలను కూడా పట్టాలెక్కించడం లేదు, అయితే బుల్లితెరలో మెయిన్ స్పేస్ ఉండేది సీరియల్స్ ..ఇక లాక్ డౌన్ వేళ కూడా ఇంట్లో ఉన్న అందరూ సీరియల్స్ చూస్తు ఉండేవారు.

 

అయితే ఈ కరోనా వల్ల సీరియల్స్ పై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది అంటున్నారు.. ఇప్పటికే బాలీవుడ్ లో చాలా సీరియళ్లు షూటింగులు ఆగిపోయాయి… ఇక మిగిలిన భాషల్లో కూడా చాలా వరకూ సీరియళ్లు షూటింగులు నిలిపివేశారు, అయితే తెలుగులో కూడా ఇదే పరిస్దితి ఉండవచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి.

 

గత ఏడాది వైరస్ విజృంభణ లో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ లో సినీ రంగాలు, వ్యాపార రంగాలు అన్ని మూతపడగా.. ప్రభుత్వం లాక్ డౌన్ ను నిషేధించిన తర్వాత తిరిగి అన్ని ప్రారంభమయ్యాయి. సీరియళ్లు కూడా ముందు షూటింగ్ ఆపేశారు తర్వాత మళ్లీ ప్రారంభించారు. అయితే మళ్లీ కేసులు పెరగడంతో సీరియళ్ల షూటింగ్ ఆపే ఆలోచనలో కొందరు ఉన్నారని వార్తలు వస్తున్నాయి, అయితే ఆ సీరియళ్లు ఆగినా మళ్లీ ఆ సీరియళ్లు పాత ఎపిసోడ్లు వేస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి.