యంగ్ హీరో పై కేసు నమోదు చేసిన పోలీసులు

యంగ్ హీరో పై కేసు నమోదు చేసిన పోలీసులు

0
92

టాలీవుడ్ లో ఎలాంటి బ్యా గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోల్లో రాజ్ తరుణ్ ఒకరు. షార్ట్ ఫిలిమ్స్ తో తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకొని ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయమయ్యాడు. రాజ్ తరుణ్ సినిమాల్లోకి డైరెక్టర్ అవ్వాలని వచ్చాడు. ఐ తరుణంలోనే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న తరుణంలో నే నాగార్జున కంట్లో ప డ డం ఉయ్యాల జంపాల సినిమాలో హీరోగా ఛాన్స్ దక్కించుకోవడం జరిగి పోయాయి.

ఇక అసలు విషయానికి వస్తే రెండు రోజుల క్రితం నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అల్కాపూరి సమీపంలో నటుడు రాజ్ తరుణ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికాగా, వెంటనే రాజ్ తరుణ్ అక్కడి నుంచి పారిపోయిన సంగతి తెలిసిందే. తొలుత ఈ ప్రమాదానికి కారణం మరో నటుడు తరుణ్ అన్న ప్రచారం జరిగినప్పటికీ, చివరకు కారు నడిపింది తానేనని రాజ్ తరుణ్ మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు రాజ్ తరుణ్ పై కేసు పెట్టారు. విచారణకు రావాల్సిందిగా ఆయనకు ట్విట్టర్ ద్వారా సమాచారాన్ని అందించినట్టు నార్సింగ్ పోలీసు ఇనస్పెక్టర్ రమణ గౌత్ వెల్లడించారు.

ఆయనతో మాట్లాడిన తరువాత కేసు విషయంలో ముందుకెళ్లే విషయమై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని, నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేసినందున కేసు పెట్టామని అన్నారు.