సినీనటి పై కేసు నమోదు

సినీనటి పై కేసు నమోదు

0
85

ఒక ఐటీ ఉద్యోగిని పట్ల సినీ నటి దురుసుగా వ్యవహరించిన వైనం హైదరాబాద్ లో చోటుచేసుకుంది అంతేకాదు.. బంజారాహిల్స్ లోని పోలీస్ స్టేషన్ సదరు నటిపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే… బిల్డింగ్ సెక్యూరిటీగా పనిచేస్తున్న లక్ష్మి అనే మహిళను సినీనటి రాధా ప్రశాంతి కారు ఢీ కొట్టింది.

శబ్దం పెద్దగా వినిపించడంతో స్థానికంగా ఉండే ఇంజినీర్ బయటకొచ్చి చూశారు. సదరు మహిళపై సినీనటి రాధా ప్రశాంతి మరొకరు దాడి చేస్తున్న ఈ విషయాన్ని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తన సెల్ ఫోన్ లో చిత్రీకరించారు.

దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రాధాప్రశాంతి సదరు ఐటీ ఉద్యోగి ని పట్ల దురుసుగా వ్యవహరించినట్లు ఆరోపిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాధా ప్రశాంతి పైన బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.