Breaking: ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు..

0
78

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ‘పుష్ప’ సినిమాతో దేశవ్యాప్తంగా ఘన విజయం సాధించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాడు. కానీ ప్రస్తుతం అల్లుఅర్జున్ అభిమానులు నిరాశచెందే వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఆయనపై హైదరాబాద్ లోని అంబర్ పేట పోలీస్ స్టేషన్ లో ఉపేందర్ రెడ్డి  కేసు నమోదు చేసారు.

కారణం ఏంటంటే..ఇటీవల బన్నీ చేసిన యాడ్ ఒకటి వివాదాస్పదమైంది. శ్రీ చైతన్య విద్యా సంస్థల కోసం బన్నీ చేసిన యాడ్ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉందని సామాజిక కార్యకర్త ఉపేందర్ రెడ్డి విమర్శిస్తూ యాడ్ లో నటించిన బన్నీ, తప్పుడు సమాచారం ఇచ్చిన శ్రీ చైతన్య విద్యా సంస్థలపై ఉపేందర్ రెడ్డి  పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేశాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది.