Flash: టాలీవుడ్‌ హీరోపై కేసు నమోదు..కారణం ఇదే?

0
77

విద్యాసాగర్‌ చింతా దర్శకత్వంలో విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించిన ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ ఈ నెల 6న విడుదలకానుంది. ఈ చిత్రంలో  విశ్వక్‌ సేన్‌ సరసన రుక్సర్‌ థిల్లాన్‌ కథానాయికగా నటించింది. ఈ సినిమాపై బాపినీడు, సుధీర్‌ ఈదర బాధ్యతలు స్వీకరించి నిర్మించారు.

ఈ సినిమాలో భాగంగా బహిరంగ ప్రదేశంలో సినిమా ప్రచారం కోసం హీరో విశ్వక్ సేన్‌ చేసిన న్యూసెన్స్  ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సినిమాలో ఒక సీన్ కోసం విశ్వక్‌ సేన్‌ చేసిన న్యూసెన్స్ పై  ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలా చేస్తే యువతపై  తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ విషయంపై టాలీవుడ్‌ హీరో విశ్వక్‌సేన్‌పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో కేసు నమోదు అయింది.  విశ్వక్‌పై తగిన చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో పేర్కొన్నారు. సినిమా ప్రచారం పేరుతో పబ్లిక్‌కు అంతరాయం కల్గించడం కారణంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో హైకోర్టు న్యాయవాది అరుణ్‌ కుమార్‌ పిర్యాదు చేసారు.