కేథరిన్ కు భారీగా రెమ్యునరేషన్ ఇస్తున్న బోయపాటి

కేథరిన్ కు భారీగా రెమ్యునరేషన్ ఇస్తున్న బోయపాటి

0
82

హీరోలతో పోలిస్తే హీరోయిన్ల రెమ్యునరేషన్ 50 శాతం తక్కువ ఉంటుంది అంటారు.. కాని కొందరు నటీమణులు మాత్రం హీరోల కంటే పెచ్చు పారితోషికం తీసుకునే వారు ఉన్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో చాలా మంది ముద్దుగుమ్మలు ఇలాగే ఉన్నారు.. అయితే మన సౌత్ లో మాత్రం ఇంకా అంత స్టేజ్ రాలేదు అనే చెప్పాలి ..హీరోలకే రెమ్యునరేషన్ లో అగ్రతాంబూలం.

తాజాగా బోయపాటి బాలయ్య బాబుతో చేస్తున్న సినిమాకి వర్క్ అంతా జరుగుతోంది ..ఈ సమయంలో దర్శకుడు బోయపాటి హీరోయిన్ కోసం వెతుకులాట చేస్తున్నారు అనేది తెలిసిందే.. బోయపాటి కేథరిన్ ను తీసుకోవాలని అనుకున్నారు. ఆమె కూడా అందుకు ఓకె అనేసింది. బాలయ్య బాబుకి హీరోయిన్ దొరకింది అయితే ఆమె సెకండ్ హీరోయిన్ అని వార్తలు వస్తున్నాయి అయితే అది పూర్తిగా ఇంకా తెలియాలి.

అయితే కేథరిన్ కు రెమ్యునరేషన్ భారీగా పెరిగిందట, కోటి రూపాయల నుంచి చివరకు చిత్ర యూనిట్ 80 లక్షలకు సెటిల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే మరో హీరోయిన్ ఎవరు అనేది కొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. బాలయ్య బాబు పక్కన కేథరిన్ బాగుంటుంది అంటున్నారు బాలయ్య అభిమానులు