అలనాటి అందాల తార శ్రీదేవి మృతి(Sridevi Death) కేసు మరోసారి తెర పైకి వచ్చింది. ఆమె మరణం పై ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ డాక్యుమెంట్స్ అంటూ ఓ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె మరణంపై ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లపై ఆరోపణలు చేసింది. ఈ డాక్యుమెంట్స్ బాగా వైరల్ అవడంతో శ్రీదేవి మృతిపై మరోసారి చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన సీబీఐ పోలీసులు నకిలీ పత్రాలు సృష్టించిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై సీబీఐ కేసు నమోదు చేసి, ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడం సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..
భువనేశ్వర్ కి చెందిన దీప్తి ఆర్ పిన్నిటి అనే మహిళ శ్రీదేవి మరణంపై నకిలీ పత్రాలను సృష్టించింది. శ్రీదేవి మరణం(Sridevi Death) పై అనుమానాలు వ్యక్తం చేస్తూ చర్చలు జరిపింది. అంతేకాదు, ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివాదాస్పద ఆరోపణలు కూడా చేశారు. తాను శ్రీదేవి మరణం పై సొంతంగా ఇన్వెస్టిగేషన్ చేశానని, ఆమె మృతి పై యూఏఈ, భారత్ నిజాలు దాచాయని పేర్కొన్నారు.
తన వాదనలను సమర్థిస్తూ ప్రధానమంత్రి మోడీ, డిఫెన్స్ మినిష్టర్ రాజ్ నాథ్ సింగ్ లేఖల్ని, యూఏఈ డాక్యుమెంట్లను చూపించారు. దీప్తి చర్యలపై చాందినీ షా అనే లాయర్ సీబీఐకి కంప్లైంట్ చేశారు. దీంతో CBI పోలీసులు దీప్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఛార్జ్ షీట్ దాఖలు చేసి దర్యాప్తు ప్రారంభించారు.