సూపర్ స్టార్ కృష్ణకు మహేష్‌, ప్రముఖుల నివాళి

-

గతేడాది నవంబర్ 15న అనారోగ్యంతో సూపర్ స్టార్ కృష్ణ(Super Star Krishna) మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణించి నేటితో ఏడాది పూర్తైన సందర్భంగా అభిమానులు, కుటుంబసభ్యులు, ప్రముఖులు ఆయనను స్మరించుకుంటూ నివాళులర్పిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ క్లబ్‌లో తొలి వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో మహేష్ బాబు, ఘట్టమనేని కుటుంబసభ్యులతో పాటు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు హాజరై కృష్ణకి నివాళులర్పించారు.

- Advertisement -

“నాన్న నిన్ను చాలా మిస్ అవుతున్నాము. నేను మీ ఇంటికి వచ్చాను. ఒకప్పుడు మేము వస్తే నువ్వు ఎంత బిజీలో ఉన్న మా కోసం వచ్చేవాడివి. సినిమాల్లో నువ్వు ఒక మ్యాజిక్ క్రియేట్ చేశావని ప్రపంచం మొత్తం చెబుతుంటుంది. కానీ వాళ్ళకి తెలియదు నువ్వు పర్సనల్ లైఫ్ లో కూడా అదే మ్యాజిక్ ని క్రియేట్ చేశావని. లవ్ యు నాన్న” కృష్ణ(Super Star Krishna) కూతురు మంజుల తెలిపారు.

Super Star Krishna

ఇక కృష్ణ అల్లుడు, హీరో సుధీర్ బాబు “మామయ్య , మీకు మాకు ఉన్న దూరం ఎంత? కలవరిస్తే కలలోకి వచ్చేంత, తలచుకుంటే మా గుండెల్లో బ్రతికేంత. ఆగిపోలేదు మీ ప్రస్థానం, ఆరిపోలేదు మా అభిమానం. మరువను నేను, మరువదు నేల. మీ కీర్తి, మీ స్పూర్తి అమరం అద్భుతం” అంటూ ఇన్‌స్టా పోస్ట్ చేశారు.

Read Also: వరల్డ్ రికార్డు సృష్టించిన కెప్టెన్ రోహిత్ శర్మ
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...