Breaking: గుండె నొప్పితో ప్రముఖ సింగర్ మృతి..

0
78

చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. వరుస విషాదాలతో చిత్రపరిశ్రమలో కంటతడి కూడా అరనివ్వడం లేదు. తాజాగా ప్రముఖ సింగర్​, మ్యూజిక్​ డైరెక్టర్​ ప్రఫుల్లా కార్ వృద్ధాప్య సమస్యల కారణంగా అతని నివాసంలో తుది శ్వాస విడిచాడు. ఆదివారం రాత్రి భోజనం చేసిన అనంతరం గుండెలో నొప్పి రావడంతో..మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

కార్ 1939లో జన్మించారు. అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అతడు అన్ని రంగాల్లో ముందుండి నిలిచేవాడు. మ్యుజిషియన్​, సింగర్​, లిరికిస్ట్​, రైటర్​, కాలమనిస్ట్​గా చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు సినీరాజకీయ ప్రముఖులు సైతం నివాళులు అర్పించారు. ప్రద్మశ్రీ అవార్డు, జయదేవ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు.