విజయ్ ‘లైగర్’ సినిమా సెన్సార్ కంప్లీట్..రన్ టైమ్ ఏంతంటే?

0
135

రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో వరల్డ్ వైడ్ క్రేజ్ సంపాదించుకొని గీతా గోవిందంతో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక తాజాగా విజయ్ నటిస్తున్న మూవీ లైగర్.

ఈ సినిమాను డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తుండగా..అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో రౌడీ హీరో బాక్సర్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు. ‘లైగర్’ ఆగస్టు 25న విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది టీమ్.

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ సినిమాపై హూప్స్ పెంచాయి.  తాజాగా ఈ మూవీ సెన్సార్ వర్క్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ప్రకారం లైగర్ చిత్రం దాదాపు 2 గంటల 20 నిమిషాల రన్ టైమ్ ఉన్నట్లు తెలుస్తోంది. యాక్షన్ సీక్వెన్స్, పాటలతోపాటు.. మూవీలో మరిన్ని సన్నివేశాలు ఆకట్టుకునే సన్నివేశాలు ఉన్నాయి. బాక్సర్ పాత్రలో విజయ్ నటన అదిరిపోయిందని.. ఇక అనన్య, రమ్యకృష్ణ తమ పాత్రలో జీవించేసినట్లు తెలుస్తోంది.