చై-సామ్ ఇష్యూ..హీరో సిద్దార్థ్ ఆసక్తికర విషయాలు

0
96

నాగచైతన్య – సమంత విషయంలోకి తనని లాగొద్దని నటుడు సిద్ధార్థ్‌ అన్నారు. చాలా సంవత్సరాల విరామం తర్వాత ఆయన నేరుగా తెలుగులో నటిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’. అజయ్‌ భూపతి దర్శకత్వం వహించిన ఈ ఇంటెన్స్‌ ప్రేమ కథాచిత్రం అక్టోబర్‌ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న సిద్ధార్థ్‌ తన సినీ కెరీర్‌ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. అనంతరం ఇటీవల సామ్‌-చై విడిపోతున్నట్లు ప్రకటించిన సమయంలో తాను చేసిన ట్వీట్‌పై స్పందించారు. అది ఎందుకంత వైరల్‌గా మారిందో తనకి కూడా తెలియడం లేదని అన్నారు.

చై-సామ్‌ 2017లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ ఈ నెల 2న తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. చై-సామ్‌ ట్వీట్ చేసిన కొన్ని గంటల తర్వాత సిద్ధూ ఓ ట్వీట్‌ చేశారు. ‘మోసం చేసేవాళ్లు జీవితంలో ఎప్పుడూ అభివృద్ధి చెందరు. ఈ విషయాన్ని స్కూల్‌లో ఉన్నప్పుడు మా టీచర్‌ చెప్పింది’ అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నాడు. దీంతో సామ్‌ని ఉద్దేశిస్తూనే సిద్ధూ ఆ ట్వీట్‌ చేశాడని అందరూ చెప్పుకున్నారు.