విడాకులపై చైతూ షాకింగ్ కామెంట్స్..ఇప్పటికీ సమంతపై..

0
97

నాగచైతన్య, సమంత విడాకుల తరువాత తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఏదో ఒక విషయంలో వీరు చేసిన కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. సినిమాల విషయానికొస్తే చై థాంక్యూ మూవీతో థియటర్లలోకి రాగా.. సామ్ యశోద, శాకుంతలం వంటి సినిమాలు చేస్తుంది.

నాగచైతన్య – సమంత ఏ మాయ చేసావే అనే సినిమా ద్వారా ప్రేమలో పడ్డారు. అనంతరం కుటుంబసభ్యుల అంగీకారంతో వివాహం చేసుకోవడం జరిగింది. ఇక వివాహం అనంతరం మజిలీ సినిమాలో నటించారు. ఇక్కడివరకు అంతా బాగా ఉన్న ఏమి జరిగిందో తెలీదు. ఉన్నట్టుండి నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. కానీ దీనికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు.

ఇటీవల కాఫీ విత్ కరణ్ షో కి హాజరై నాగచైతన్య పై సమంత సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక తాజాగా విడాకులు తీసుకున్న తర్వాత తనపై.. సమంత గురించి వస్తున్న వార్తలపై చైతూ స్పందించాడు. మేమిద్దరం మా స్టేట్మెంట్స్ ఇచ్చాము. మాకు ఒకరిపై మరొకరికి అమితమైన గౌరవం ఉంది. ఎప్పుడూ ఆమె పై గొప్ప గౌరవం ఉంది. మా గురించి మేము మా వద్ద ఉన్నదే చెప్పాము. కానీ అంతకుముంచి మా మధ్య ఉన్నదాన్ని పూరించేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు. మా గురించి వస్తున్న వార్తలు చూసి విసుగు చెందాను అని అన్నారు.