చాలా పెద్ద ఆఫ‌ర్ వ‌ద్ద‌న్న సాయిప‌ల్ల‌వి

చాలా పెద్ద ఆఫ‌ర్ వ‌ద్ద‌న్న సాయిప‌ల్ల‌వి

0
99

ఏ సినిమా ఆఫ‌ర్ వ‌చ్చినా, దానితో పాటు రెమ్యున‌రేష‌న్ ఎక్కువ ఇస్తాము అని చెప్పినా సాయిప‌ల్లవి మాత్రం అన్నీ సినిమాలు చేయ‌దు..మిగిలిన హీరోయిన్ల‌తో పోల్చుకుంటే సాయిప‌ల్ల‌వి సెల‌క్ట్ చేసుకునే సినిమాలు చాలా డిఫ‌రెంట్ గా ఉంటాయి, క‌థ‌లో త‌న పాత్ర బాగుండాలి ఇవ‌న్నీ త‌న‌కు ఉంటేనే ఆ సినిమా ఒకే చేస్తుంది, లేక‌పోతే ఆ సినిమాని వ‌ద్దు అని ప‌క్క‌న పెడుతుంది.

ఎంత పెద్ద పారితోషికం ఇస్తానన్నా ఒప్పుకోదు. తాజాగా అలాగే ఓ భారీ ఆఫర్ ను ఆమె తిరస్కరించినట్టు తెలుస్తోంది… తాజాగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తేజ హీరో గోపిచంద్ తో సినిమా తీయ‌నున్నార‌ట‌, ఇందులో ఆమెని హీరోయిన్ గా తీసుకుందామ‌ని భావించారు.

అయితే క‌ధ‌లో ఆమె పాత్ర నచ్చకపోవడంతో వెంటనే ఆమె నో చెప్పేసిందని అంటున్నారు. అయితే ఇప్పుడు యాక్ష‌న్ హీరో సినిమాలో ర‌కుల్ లేదా అనుష్క ని సంప్ర‌దించ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.