బుల్లితెరపై జబర్దస్త్ షో ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే.. కొన్ని సంవత్సరాలుగా నెంబర్ వన్ షోగా కొనసాగుతోంది అయితే ఇందులో ఆర్టిస్టులకి కూడా మంచి పేరు ఫేమ్ వచ్చింది, ముఖ్యంగా జబర్ధస్త్ లో నటించిన వారు ఇటు సినిమాల్లో కూడా అవకాశాలు పొందారు.. దాదాపు 20 మంది వరకూ చిత్ర సీమకు జబర్ధస్త్ నుంచి పరిచయం అయ్యారు అనే చెప్పాలి.. ఇటు పలు షోలు చేసుకుంటూ బిజీగా మారారు.
అయితే జబర్ధస్త్ నుంచి అదిరిందికి వెళ్లిన చమ్మక చంద్ర అంటే అందరికి ఎంతో ఇష్టం.. ఆయన స్కిట్లు అద్బుతంగా ఉంటాయి.. ముఖ్యంగా ఆ మాటలు డైలాగ్స్ యాక్షన్ కు లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు… అయితే చంద్ర ఏ రేంజ్ లో ఫేమ్ సంపాదించారో తెలిసిందే, అయితే ఆయన ఆర్ధిక క్రమశిక్షణ కూడా మనం తెలుసుకోవాలి, ఇటు జబర్ధస్త్ అలాగే అదిరిందిలో కూడా హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న నటుడు ఆయన.
అయితే ఆ నగదుని సరైన వాటిపై పెట్టుబడి పెట్టారట, ఆయనకు కోటి రూపాయల విలువ చేసే ఇళ్లు హైదరాబాద్ లోఉంది.. అలాగే ఆయన సొంత ఊరు నిజామాబాద్ లో ఇళ్లు పొలాలు సంపాదించుకున్నారు..ఇలా భూమిపై ఆయన పెట్టుబడి పెట్టారు.. అందుకే ఆయన జబర్దస్త్ టీమ్ లో అందరి కంటే రిచ్ అని అంటారు, ముఖ్యంగా నేటి యువత ఆయనని ఆర్దిక క్రమ శిక్షణలో రోల్ మోడల్ గా తీసుకోవాలి అని అంటారు.