బాలీవుడ్ లో ఆ హీరో సినిమాలో ర‌కుల్ కు ఛాన్స్ ?

Chance for Rakul Preet Singh in that hero movie in Bollywood

0
126

తెలుగులో అంద‌రు స్టార్ హీరోల‌తో సినిమాలు చేసి టాప్ హీరోయిన్ గా కొన‌సాగుతోంది ర‌కుల్ ప్ర‌తీ సింగ్. తాజాగా ఆమె ఇటు కోలీవుడ్ ,బాలీవుడ్ లో కూడా ప‌లు క‌ధ‌లు వింటూ సినిమాలు చేస్తోంది.
చిత్ర సీమ‌లోకి వ‌చ్చిన స‌మ‌యంలో చిన్న సినిమాతో తన కెరియర్ ను మొదలుపెట్టిన రకుల్, స్టార్ హీరోల జోడీగా మెరవడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు.

ఆమెకి తెలుగు నుంచి కోలీవుడ్ లో కూడా అవ‌కాశాలు బాగానే వ‌చ్చాయి. ఇక ఇప్పుడు బాలీవుడ్ పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ‌. బాలీవుడ్ లో ఓ మూడు సినిమాలు చేస్తోంది. అంతేకాదు అక్షయ్ కుమార్ జోడీగా చేసే ఛాన్స్ కొట్టేసింది. రంజిత్ తివారి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు.

ఈ సినిమాలో ఆమెకి ఛాన్స్ వ‌చ్చింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ముందు కియ‌రా , శ్ర‌ద్దా క‌పూర్ పేర్లు వినిపించాయి. తాజాగా ర‌కుల్ పేరు వినిపిస్తోంది. ఇక ఇటీవ‌ల తెలుగులో ఆమెకి సినిమా అవ‌కాశాలు త‌గ్గాయి. ఇక కోలీవుడ్ పై కూడా పెద్ద ఫోక‌స్ చేయ‌డం లేదు. ఇక బాలీవుడ్ లో మాత్రం ఆమెకి ఇప్పుడు చాలా అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ఆమె అభిమానులు మాత్రం ఈ వార్త విని చాలా ఆనందంలో ఉన్నారు.