గోపీచంద్ సినిమాలో ఆ బ్యూటికి ఛాన్స్ టాలీవుడ్ టాక్

Chance for that beauty heroine in Gopichand movie

0
125

హీరో గోపీచంద్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఇక శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.
దీనిపై అధికారిక ప్రకటన వచ్చేసింది. లౌక్యం, లక్ష్యం వంటి సూపర్ హిట్లను శ్రీవాస్ గోపీచంద్ కు ఇచ్చారు. ఇప్పుడు వీరి కాంబో మరోసారి రాబోతోంది. దీంతో ఇటు ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలో గోపీచంద్, రాజశేఖర్ అన్నతమ్ముళ్లుగా కనిపించనున్నారని కొన్ని వార్తలు వినిపించాయి. ఇక దీనిపై చిత్ర యూనిట్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.

nabha natesh

దీనిపై యూనిట్ అధికారిక ప్రకటన చేసే వరకూ నమ్మలేము అంటున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమాలో గోపీచంద్ సరసన నభా నటేష్ నటించనుందనే వార్త టాలీవుడ్ లో వినిపిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఆమెకి మంచి సక్సస్ అందింది. ఇస్మార్ట్ శంకర్లో తన అందం, అభినయంతో ఆకట్టుకుంది ఈ చిన్నది.

ఇప్పుడు నితిన్ సరసన మాస్ట్రోలో నటిస్తోంది నభా నటేష్. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. చూడాలి దీనిపై ప్రకటన ఎప్పుడు వస్తుందో. ఈ సినిమాలో నభాని తీసుకుంటారా మరో కథానాయిక వస్తుందా అనేది అప్పుడే క్లారిటీ వస్తుంది.