వకీల్ సాబ్ చిత్రం సెట్స్ పై పెట్టారు పవన్ కల్యాణ్, ఆ తర్వాత ఆయన క్రిష్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు, ఇప్పటికే రెండు సినిమాలు స్టార్ట్ అయ్యాయి, అయితే ఈ కరోనా లాక్ డౌన్ తో షూటింగులకి బ్రేకులు ఇచ్చారు, ఇక వచ్చే నెల నుంచి పలు చిత్రాలు సెట్స్ పైకి వెళ్లనున్నాయి.
ఇక పవన్ చిత్రం కూడా షూటింగ్ మళ్లీ స్టార్ట్ అవ్వనుంది అంటున్నారు.
ఈ సమయంలో పవన్ కల్యాణ్ హరీశ్ శంకర్ సినిమాపై వార్తలు వినిపిస్తున్నాయి.. గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని రూపొందించిన హరీశ్ శంకర్ ఇప్పుడు పవన్ తో ఎలాంటి సినిమా చేయబోతున్నారు అనే చర్చ జరుగుతోంది అభిమానుల్లో.
ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో పవన్ సరసన పూజ హెగ్డేని తీసుకోవాలి అని దర్శకుడు భావిస్తున్నారట, ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది, ఇప్పుడు టాలీవుడ్ లో ఆమె మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్, ఆమెకి చేతినిండా సినిమాలు ఉన్నాయి, పవన్ సరసన ఆమె అయితే బాగుంటుంది అని దర్శకుడు చిత్ర యూనిట్ భావిస్తున్నారట.