బుల్లితెరలో అతిపెద్ద రియాల్టీ షోగా గుర్తింపు తెచ్చుకుంది బిగ్ బాస్… తెలుగులో వచ్చిన మూడు సీజన్లు సజావుగా జరిగినా సీజన్4పై మాత్రం ప్రేక్షకులకు అనేక సందేహాలు వచ్చాయి… కరోనా వేళ సీజన్4ను నిర్వహిస్తారా లేదా నిర్వహిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఇలా అనేక సందేహాలు ఉండేవి…
అయితే ఇటీవలే వీటికి చెక్ పెడుతూ యాజమాన్యం ఒక టీజర్ ను విడుదల చేసింది… అయితే రోజురోజుకు కరోనా కేసులు ఎక్కువ అవుతుండటంతో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది… కంటెస్టెంట్స్ టెక్నీషియన్లు వ్యాఖ్యాతలు కోసం భారీగా ఇన్సూరెన్స్ చేయించారని టాక్ హౌస్ మెంట్స్ అందరికి కరోనా టెస్టులు చేసిన తర్వాత 15 రోజులు క్వారంటైన్ లో ఉంచి దాని తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి పంపుతారని తెలుస్తోంది…
అలాగే హోస్ట్ విషయంలో కూడా ఏమాత్రం రాజీపడలేదన ఒక మేకప్ మ్యాన్ మాత్రమే అతని దగ్గర ఉండేటట్లు ఇతర టెక్నీషియన్లు ఎవరూ ఆయనను నేరుగా కలువకుండా ఏర్పాటు చేస్తోంది.. కాగా ఈ సీజన్ కూడా హోస్ట్ గా నాగార్జున ఉంటారని టాక్