చరణ్ సినిమాలో విలన్ ఇప్పుడు చిరు సినిమాలో చేయనున్నారా

చరణ్ సినిమాలో విలన్ ఇప్పుడు చిరు సినిమాలో చేయనున్నారా

0
118

రోజా సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే… ఇందులో హీరో అరవింద్ స్వామి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు, అయితే ఆయన ఇప్పుడు విలన్ పాత్రలు కూడా చేస్తూ తన నటనని కొనసాగిస్తున్నారు, గతంలో హీరోలుగా చేసిన వారు చాలా మంది ఇప్పుడు ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.. జగపతి బాబు కూడా ఇప్పుడు ఎంతో ఫేమ్ పొందారు, అలాగే అరవింద్ స్వామికి అవకాశాలు వస్తున్నాయి.

రామ్ చరణ్ నటించిన ధృవ సినిమాలో విలన్ గా తనదైన ముద్ర వేశాడు. ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా బాగుందని ప్రశంసలు వచ్చాయి, పలు క్యారెక్టర్లు ఆయనకు ఇలాంటివి వస్తున్నాయి, అంతేకాదు రాజకీయ నాయకుడిగా కూడా మంచి రోల్స్ ఆఫర్లు వస్తున్నాయి.

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందుతున్న ఆచార్య చిత్రంలో ప్రధాన విలన్ పాత్రకి కొంతమందిని పరిశీలించిన తర్వాత ఆయన పేరు కూడా పరిశీలించారట, తాజాగా ఆయనని విలన్ గా తీసుకోవాలి అని చూస్తున్నారట, గతంలో చరణ్ తో సూపర్ హిట్ అయింది వీరి సినిమా… ఇప్పుడు ఆచార్య కు కూడా ఆయన అయితే బెటర్ అని చిత్ర యూనిట్ ఆలోచన చేస్తోంది, అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది, మరి ఎవరిని ఫైనల్ చేస్తారో.