చరణ్ ఇచ్చిన సలహా పాటిస్తున్న ప్రభాస్

చరణ్ ఇచ్చిన సలహా పాటిస్తున్న ప్రభాస్

0
85

బాహుబలి ప్రభాస్ సాహో తర్వాత చేస్తున్న చిత్రం జాన్ అనే అన్ టైటిల్ చిత్రం.. ఈ సినిమా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ గతంలో ఒప్పుకున్నారు ..ఆ కమిట్మెంట్ ప్రకారం సినిమా కూడా చేస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఒక్క అప్ డేట్ కూడా చిత్ర యూనిట్ బయటకు విడుదల చేయడం లేదు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది.

ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా కొంతవరకూ షూటింగ్ జరుపుకుంది.. ఇక ఫారెన్ షూట్ కంటే ముందుగానే ఇక్కడ హైదరాబాద్ లోని ఒక స్టూడియోలో భారీ సెట్స్ వేయడానికి సన్నాహాలు చేయడం మొదలుపెట్టారు. దీంతో ఈ షూట్ అయిన తరువాత ఫారెన్ లో షూట్ చేయనున్నారు అని తెలుస్తోంది.

అయితే స్టూడియోస్ లో కంటే ప్రైవేట్ స్థలంలో సెట్స్ వేయడం వలన ఖర్చు బాగా కలిసొస్తుందనీ, సైరా ఖర్చును అలా తగ్గించుకున్నామని ప్రభాస్ తో చరణ్ గతంలో చెప్పాడట. తాజాగా ప్రభాస్ సినిమాలో కూడా అదే ఆలోచించి చరణ్ చెప్పినట్లు ప్రభాస్ చిత్ర యూనిట్ భావించింది అని తెలుస్తోంది.. చరణ్ సలహాను ఆచరణలో పెట్టమని ప్రభాస్ నిర్మాతలకు చెప్పారట.. హైదరాబాద్ శివారు ప్రాంతమైన తెల్లాపూర్ విలేజ్ సమీపంలో కొన్ని ఎకరాల స్ధలాన్ని లీజుకి తీసుకుని భారీ సెట్లు వేస్తున్నారట.