చరణ్ – శంకర్ సినిమాలో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర – బాలీవుడ్ టాక్

చరణ్ - శంకర్ సినిమాలో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర - బాలీవుడ్ టాక్

0
87

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆచార్య అలాగే ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నారు… ఈ సినిమా తర్వాత ఆయన శంకర్ తో సినిమా ప్రకటించారు.. సౌత్ ఇండియాలోదర్శకుడు శంకర్ కు ఎంతో క్రేజ్ ఉంది….ముఖ్యంగా ఇండియాలో టాప్ డైరెక్టర్లలో ఆయనకు ఎంతో పేరు ఉంది…. అయితే దిల్ రాజు నిర్మాతగా శంకర్ చరణ్ కాంబోతో సినిమా రానుంది… ఈ సినిమా గురించి కాస్టింగ్ గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి…. కాని దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

 

ఈ సినిమాలో హీరోయిన్ గురించి, సంగీత దర్శకుడు గురించి ఇలా పలురకాల రూమర్స్ వినిపించాయి. అయితే తాజాగా బీటౌన్ మీడియాలో ఓ వార్త వినిపిస్తోంది… అది ఏమిటి అంటే.. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

 

ఈ చిత్రంలో సల్మాన్కు ఓ కీలక పోలీస్ ఆఫీసర్ పాత్ర ఉంటుందని బాలీవుడ్ మీడియా రాస్తోంది. అయితే చరణ్ కు సల్మాన్ కు మంచి స్నేహం ఉంది… మొత్తానికి చరణ్ శంకర్ ఈ రోల్ గురించి ఆయనతో త్వరలో చర్చిస్తారు అని వార్తలు బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి.