చిరంజీవికి సోదరిగా టాప్ హీరోయిన్

చిరంజీవికి సోదరిగా టాప్ హీరోయిన్

0
91

చిరుతో సినిమా అంటే ఎవ‌రైనా ఒకే చెబుతారు, ఏ పాత్ర అయినా చేస్తాము అని చెబుతున్నారు, భారీ బ‌డ్జెట్ సినిమాలకు చిరు పేరు, మంచి క‌మ‌ర్షియ‌ల్ హిట్లు అన్నీ ఆయ‌న ఖాతాలో ఉన్నాయి.
తాజాగా చిరంజీవి సోదరి పాత్రలో అలనాటి తార సుహాసిని నటించబోతున్నారని టాలీవుడ్ లో చ‌ర్చ ప్ర‌చారం జ‌రుగుతోంది.

లూసిఫర్ ను తెలుగులో రీమేక్‌ చేయబోతున్న సంగతి తెలిసిందే. సుజీత్‌ దర్శకత్వం వహించబోతున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ పతాకంపై రామ్‌ చరణ్‌ నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో సుహ‌సిని న‌టించ‌నున్నార‌ట‌.

మాతృకలో మంజూ వారియర్‌ పోషించిన పాత్రలో ఆమె నటించబోతున్నట్లు తెలుస్తోంది. సుహాసినికి కూడా పాత్ర నచ్చడంతో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే చిత్ర ప్ర‌క‌ట‌న‌తో పూర్తిగా దీనిపై క్లారిటీ వ‌స్తుంది.. ఇక చిరంజీవి ఆచార్యలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకుడు, త్వ‌ర‌లో షూటింగ్ ప్రారంభం కానుంది.