చిరంజీవి సినిమా పై క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్ ఆల్ ది బెస్ట్

చిరంజీవి సినిమా పై క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్ ఆల్ ది బెస్ట్

0
72

మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఆచార్య సినిమా చేస్తున్నారు, ఈ సినిమా తర్వాత ఆయన లూసిఫర్ సినిమా చేయనున్నారు అని వార్తలు వినిపించాయి, అయితే ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు, ఈ సినిమా విడుదల సమయంలో లూసిఫర్ పై ప్రకటన వస్తుంది అని అందరూ ఎదురుచూశారు.

అయితే తాజాగా చిరు కొత్త సినిమా గురించి పవన్ ట్వీట్ ద్వారా క్లారిటీ వచ్చింది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో కూడా చిరు సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ… దానిపై ఇంత వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. తాజాగా పవన్ క్లారిటీ ఇచ్చారు.

పవన్ పుట్టిన రోజు సందర్భంగా పవన్ కు మెహర్ రమేశ్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు, ఈ సమయంలో పవన్ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు, అంతేకాదు అన్నయ్య చిరంజీవితో మీరు తీయబోయే సినిమాకు ఆల్ ది బెస్ట్ అంటూ అసలు విషయాన్ని బయటపెట్టారు. సో పవన్ ఇలా చెప్పడంతో ఇక తర్వాత చిరు చేయబోయే సినిమా మెహర్ రమేష్ తో అని అర్ధం అయింది.