చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన వివేక్

చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన వివేక్

0
81

ఈ రోజు ప్రముఖ హస్యనటుడ్ని సౌత్ ఇండియా చిత్ర సీమ కోల్పోయింది, తెలుగు తమిళ భాషల్లో మంచి గుర్తింపు పొందిన కమెడియన్ వివేక్ ఈరోజు గుండెపోటుతో కన్నుమూశారు, ఆయన మరణంతో శోకసంద్రలో నిండిపోయింది చిత్ర సీమ, అయితే ఆయనకు ప్రతీ ఒక్కరు సంతాపం తెలిపారు.. ఇటు తెలుగు తమిళ ఇండస్ట్రీకి చెందిన పలువురు ఆయనకు సంతాపం తెలియచేశారు.

 

అయితే ఆయన కమెడియన్ గానే మనకు తెలుసు కాని ఆయన గొప్ప వ్యక్తి, ప్రకృతి ప్రేమికుడు, సమాజంలో అందరూ బాగోవాలి అని కోరుకునే వ్యక్తి… ప్రకృతిని ఇష్టపడతారు, జంతువులు మొక్కలని బాగా ఇష్టపడతారు..

మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్ కలాంను ఇన్సిపిరేషన్గా తీసుకొని గ్లోబల్ వార్మింగ్కు వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో పాటు చెట్ల పెంపకం చేస్తూ ఉండేవారు.

 

ఆయన పెట్టుకున్న టార్గెట్ 100 కోట్ల మొక్కలు నాటడం, దీని కోసం ఆయన గ్రీన్ కలాం అనే మిషన్ ప్రారంభించారు

ఇప్పటివరకు 33.23 లక్షల మొక్కలు మాత్రమే నాటారు.ఇక ఆయన కోరిక తీరకుండానే ఈ లోకం విడిచివెళ్లిపోయారు వివేక్.. ఇదే అందరూ గుర్తు తెచ్చుకుంటున్నారు..సూర్య, విక్రం, నటి జ్యోతిక, మహానటి ఫేం కీర్తి సురేష్తో వీరు ఆయన

భౌతికకాయానికి నివాళి అర్పించారు.