చైతూ – విక్రమ్ సినిమా హీరోయిన్ ఆమెనా – టాలీవుడ్ టాక్

చైతూ - విక్రమ్ సినిమా హీరోయిన్ ఆమెనా - టాలీవుడ్ టాక్

0
107

మనం సినిమా టాలీవుడ్ లో ఎంత హిట్ అయిందో తెలిసిందే.. సూపర్ హిట్ చిత్రాల్లో టాప్ 10 సినిమాల్లో అది కూడా నిలిచిపోతుంది… అక్కినేని వారి కుటుంబానికి ఈ సినిమా ఓ చరిత్ర అనే చెప్పాలి, అయితే ఈ సినిమాని విక్రమ్ కుమార్ తీశారు.

విక్రమ్కుమార్ -నాగచైతన్య కాంబోలో వచ్చిన మనం సూపర్ టాక్ తో పాటు మంచి వసూళ్లు తీసుకువచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సినిమా బాగా నచ్చింది.

 

చైతూ-విక్రమ్ క్రేజీ కాంబినేషన్ థాంక్యూ సినిమాతో మరోసారి ఎంటర్ టైన్ చేసేందుకు వస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ఇంకా బయటకు రాలేదు, అయితే తాజాగా టాలీవుడ్ లో ఓ వార్త వినిపిస్తోంది… ఈ సినిమాలో

రాశీఖన్నాను హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారట. ఇది టాలీవుడ్ లో సినిమా ప్రపంచంలో వినిపిస్తోంది.

 

తమిళ సినిమాలతో బిజీగా ఉన్న రాశీఖన్నాకు తెలుగులో సినిమాలు లేవు. అయితే ఆమె తో ప్రస్తుతం సంప్రదింపులు చేస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి…దిల్ రాజు నిర్మించబోతున్న ఈ చిత్రంలో చైతూ యంగ్ లవర్ గా నటిస్తున్నారు.