OTT కి ఛావా, కోర్ట్ సినిమాలు… ఏ ప్లాట్ ఫామ్ లోనో తెలుసా?

-

Chhaava – Court | ఇదివరకు థియేటర్ల వద్ద బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు శాటిలైట్ ఛానల్స్ లో ఎప్పుడు ఎప్పుడు విడుదలవుతాయా అని అభిమానులు ఎదురు చూస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. OTT రిలీజ్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ఈ ప్లాట్ ఫామ్స్ పై విడుదలైతే తమ ఫేవరెట్ మూవీని ఎప్పుడైనా, ఎక్కడైనా చూసేయొచ్చు. దీంతో వెండితెరతో పాటు OTT కి కూడా అంతే స్థాయిలో ఆదరణ మొదలైంది. ఈ క్రమంలో తాజాగా విడుదలై, బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన రెండు సినిమాలు ఈ శుక్రవారమే ఓటీటీ లో విడుదలకి సిద్ధమయ్యాయి.

- Advertisement -

ఈ శుక్రవారం అంటే ఏప్రిల్ 11న ఈ సంవత్సరంలో అత్యంత చర్చనీయాంశమైన రెండు చిత్రాలు నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్‌గా అరంగేట్రం చేస్తున్నాయి. ఒకటి స్టార్-స్టడెడ్ చారిత్రాత్మక కథనం ఛావా(Chhaava) అయితే, మరొకటి పెద్ద ప్రభావం చూపిన చిన్న బడ్జెట్ తెలుగు సినిమా కోర్ట్ లో ఆర్. ఛత్రపతి శివాజీ కుమారుడు, మరాఠా సామ్రాజ్యానికి రెండవ పాలకుడు అయిన శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందించబడిన భారతీయ చారిత్రక యాక్షన్ డ్రామా ఛావా సినిమా. ఫిబ్రవరి 14, 2025న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం కేవలం 50 రోజుల్లో దాదాపు రూ. 600 కోట్లు వసూలు చేసింది. విక్కీ కౌశల్, రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా అద్భుతమైన నటనతో ఛావా విమర్శకులు, ప్రేక్షకుల నుండి అధిక ప్రశంసలు అందుకుంది. ఈ సంవత్సరంలో అత్యంత విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

మరోవైపు కోర్ట్ సినిమా బలమైన కథ, ఆకట్టుకునే కోర్టు గది సన్నివేశాలతో అందరినీ ఆశ్చర్యపరిచింది. రూ. 8 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం కేవలం రెండు వారాల్లోనే రూ. 42.30 కోట్ల కలెక్షన్‌లను దాటింది. చిన్న సినిమా అయినప్పటికీ… ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసింది. భారీగా ప్రశంసలను పొందింది. ఈ చిత్రంలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, రోహిణి, సాయి కుమార్, హర్ష వర్ధన్, శుభలేఖ సుధాకర్ ముఖ్య పాత్రల్లో నటించారు. వేర్వేరు జోనర్‌ ల నుండి రెండు పెద్ద హిట్ సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లో ఒకే రోజు విడుదల అవుతుండటంతో ఏప్రిల్ 11 సినిమా ప్రియులకు ఖచ్చితంగా జోష్ ఇవ్వనుంది.

Read Also: ఒత్తిడిని తగ్గించడానికి 27 మార్గాలు
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...

వాహనాలకు హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు.. ఎందుకు? లేకపోతే ఏమౌతుంది?

తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం...