అల్లుడు శ్రీను సినిమాతో తెరంగేట్రం చేసిన హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ మూవీ తర్వాత బెల్లంకొండ నటించిన చిత్రాలు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాయి. మధ్యలో రాక్షసుడు సినిమా మెప్పించినా ఆ తరువాత సినిమాలు ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో బాలీవుడ్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.
తెలుగులో ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతి హిందీ రీమేక్ తో ఈ హీరో బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఛత్రపతి బాలీవుడ్ రీమేక్ రూపొందుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ తాజాగా టాకీ పార్ట్ రీసెంట్ గా కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాలోని పాత్ర కోసం బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఫిజికల్‌గా సరికొత్తగా కనిపించనున్నారు.
ఛత్రపతి చిత్రానికి కథను అందించిన స్టార్ రైటర్, రాజమౌళి తండ్రి కె.వి.విజయేంద్ర ప్రసాద్ ఈ రీమేక్‌కు కథను అందించారు. ఈ సినిమాను ఓ మాస్టర్‌పీస్‌గా చేసేందుకు ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు వర్క్ చేస్తున్నారు. భలేభలే మగాడివోయ్, మహానుభావుడు వంటి తెలుగు హిట్ సినిమాలతో పాటుగా, తమిళ సినిమాలకు కూడా పని చేసిన సినిమాటోగ్రాఫర్ నిజర్ అలీ షఫీ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాతోనైనా ఈ యంగ్ హీరో బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడో లేదో చూడాలి మరి.