Chhava | పుష్ప-2 దెబ్బకు పోటీ నుంచి తప్పుకున్న ‘ఛావా’

-

Chhava – Pushpa 2 | అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ‘పుష్ప-2’ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై తారా స్థాయి అంచనాలు ఉన్నాయి. పుష్ప-2 కోసం దేశవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్ తొలి వారంలో రిలీజ్‌కు రెడీ అవుతున్న పలు సినిమాలు సందిగ్దంలో పడ్డాయి. పుష్ప-2తో బాక్సాఫీస్ దగ్గర తలపడాలా లేకుండా పోటీ నుంచి తప్పుకోవాలా అన్న ఆలోచనలో పడిపోయాయి.

- Advertisement -

ఇదిలా ఉంటే నేషనల్ క్రష్ రష్మిక మందన టాలీవుడ్ సినిమాలతో పాటు బాలీవుడ్ మూవీస్‌తో కూడా ఫుల్ బిజీ అయిపోయిందీ అమ్మడు. ఇటీవల ‘యానిమల్’ సినిమాలో మెరిసిన ఈ చిన్నది విక్కీ కౌశల్ నటించిన ‘ఛావా(Chhava)’ సినిమాలో కూడా కీ రోల్ పోషించింది. ఈ సినిమాను కూడా డిసెంబర్ తొలి వారంలో రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. మేకర్స్ ప్లానింగ్ ప్రకారం ‘ఛావా’ డిసెంబర్ 6న రిలీజ్ అవ్వాలి.

కానీ అంతకన్నా ఒక్క రోజు ముందే డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. దీంతో ఈ రెండిటి మధ్య బాక్సాఫీస్ క్లాష్ కానుంది. ఈ క్రమంలో ఫుల్ జోష్‌లో ఉన్న పుష్ప-2తో పోటీ కన్నా వాయిదా వేయడమే మేలని ఛావా మేకర్స్ భావించారు. పుష్ప-2తో పోటీ పడితే దెబ్బ తప్పదని ఫిక్స్ అయిపోయారు. ఛావా రిలీజ్‌ను వాయిదా వేసుకున్నారు. దీంతో ఛావా సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానట్లే అని తేలిపోయింది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు.

Read Also: ‘చనిపోవాలని అనుకున్నా’.. విడాకుల తర్వాత రెహ్మాన్ తొలి స్పీచ్
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Traffic Volunteers | ట్రాన్స్‌జెండర్లకూ ఉపాధి అవకాశాలు.. ఎలా అంటే..

రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్లకు కూడా ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఈ మేరకు...

Nagarjuna | ‘ఇది చాలా గొప్ప క్షణం’.. చైతూ పెళ్ళిపై నాగార్జున సంతోషం

నాగచైతన్య(Naga Chaitanya), శోభిత(Sobhita)ల పెళ్ళిని ఇరు కుటుంబాలు అంబరాన్నంటేలా నిర్వహిస్తున్నారు. కుటుంబీకులు,...