చైనా ఊహాన్ మార్కెట్లో సంపూర్ణేష్ సినిమా మ‌రో సంచ‌ల‌నం

చైనా ఊహాన్ మార్కెట్లో సంపూర్ణేష్ సినిమా మ‌రో సంచ‌ల‌నం

0
131

ఏ సినిమా యూనిట్ అయినా షూటింగ్ ల కోసం విదేశాల‌కు వెళ‌తాయి అనేది తెలిసిందే ..అవుట్ డోర్ షూటింగ్ ఎక్క‌డైనా ఉండ‌వ‌చ్చు, అయితే చైనాలో కూడా కొన్ని సినిమాలు షూట్ చేస్తారు, అయితే తాజాగా తెలుగులో సంపూర్ణేష్ బాబుకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే, ఆయన సినిమాలు అంటే చాలా మంది కొన్ని ఎక్స్ పెక్టేష‌న్స్ పెట్టుకుంటారు.

ఇప్పుడు ఈ క‌రోనా వైర‌స్ వేళ అంద‌రూ ఈ వైర‌స్ పుట్టిన ఊహాన్ మార్కెట్లో గురించి చ‌ర్చించుకుంటున్నారు..ఈ వైరస్ ఊహాన్‌లోని గబ్బిలాల మార్కెట్ నుంచి పుట్టిందని అంటున్నారు.
ఈ స‌మ‌యంలో మే 9 న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సంచలనంగా మారింది.

వైరస్ పుట్టిన ఊహాన్ నగరంలో షూటింగ్ జరుపుకున్న చివరి సినిమా అంటూ సంపూతో సినిమా చేస్తున్న చిత్ర బృందం శనివారం ఫస్ట్ లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేసింది, ఈ సినిమాని నోలాన్ మౌళి తెరకెక్కిస్తున్నారు ద‌ర్శ‌కుడిగా, అయితే చిత్ర షూటింగ్ అక్క‌డ తీశారు అని అంటున్నారు, మ‌రి రిలీజ్ అయ్యాక చూడాలి..
ఈ చిత్రాన్ని జూలై 30న రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది.