సింగర్ మనోని టార్గెట్ చేసిన చిన్మయి

సింగర్ మనోని టార్గెట్ చేసిన చిన్మయి

0
98

డబ్బింగ్ ఆర్టిస్ట్గా, గాయనిగా తమిళ, తెలుగు ప్రేక్షకులకు చిన్మయిశ్రీపాద ఎంతో దగ్గర అయింది.. అయితే అమ్మాయిల విషయంలో ఏమైనా సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంశం వస్తే వెంటనే ఆమె మీడియా ముందుకు వస్తుంది ..సోషల్ మీడియాలో వారిని నిలదీస్తుంది.

మీటూ ఆరోపణలతో సంచలనం సృష్టించింది. తమిళ ప్రముఖ రచయిత వైరముత్తుపై చిన్మయి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సమయంలో సింగర్ కార్తిక్ గురించి కూడా ఆమె కొన్ని కామెంట్లు చేశారు, అయితే ఇలా ఆరోపణలుఎదుర్కొన్న కార్తీక్ కు తాజాగా తమిళనాట డబ్బింగ్ యూనియన్ లో చోటు వచ్చింది, ఆయనకు సింగర్ మనో మద్దతుగా ఉన్నాడు.

దీనిపై ఆమె సీరియస్ అయింది,…కార్తిక్పై లైంగిక వేదింపుల ఆరోపణలు చేసిన అమ్మాయిలను తీసుకుని తన ఇంటికి రమ్మని మనోగారి నుంచి ఒకరోజు నాకు కాల్ వచ్చింది… మాకు న్యాయం చేస్తారనుకున్నా. కానీ రాజీ కుదర్చిందుకు ప్రయత్నించారని తెలిపింది…కార్తీక్ భార్య గర్భవతి. నువ్వు ఎందుకు ఆయన కెరీర్ నాశనం చేయాలనుకుంటున్నావు. మీరిద్దరూ ఎంతో కష్టపడి పైకివచ్చారు. ఇక దీన్ని వదిలెయ్యండని చెప్పారు అని చిన్నయి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

అయితే మేము ఇద్దరం చాలా కష్టపడి పైకి వచ్చాం.. మరి ఈ స్టేజ్ కు వచ్చిన తర్వాత కార్తిక్ ఇలా లైంగిక వేధింపులు చేయవచ్చా అని ప్రశ్నించింది, కార్తీక్ అంటే మంచి సింగర్ అని గౌరవం ఉంది.. కాని తను ఇలా మచ్చ తేవచ్చా అని ప్రశ్నించింది. ఆమె పెట్టిన పోస్టుకి చాలా మంది లైక్ చేస్తూ మీరు చెప్పింది కరెక్ట్ అంటున్నారు.