వరుసగా సినిమాలు ఒకే చేస్తున్న చిన్నారి పెళ్లి కూతురు అవికాగోర్

chinnari pelli kuthuru fame avika gor is full busy in movies

0
128

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో అందాల తార అవికాగోర్ పరిచయం అయింది. ఇక అక్కడ నుంచి ఆమె సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు.ఉయ్యాలా జంపాలా సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది అవికాగోర్. ఇక ఈ చిత్రం తర్వాత ఆమెకి వరుసగా అవకాశాలు వచ్చాయి. సినిమా చూపిస్తా మామ, ఎక్కడికిపోతావ్ చిన్నవాడా, రాజుగారి గది3 ఇలా వరుస సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గర అయింది.

తర్వాత తెలుగు నుంచి అవికా బాలీవుడ్ బాట పట్టింది. ఇక ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ లో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న థ్యాంక్యూ సినిమాలో ఒక కథానాయికగా నటిస్తోంది.

ఈ చిత్రంలో చైతన్యకి జోడీగా కనిపించనుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా రూపొందుతున్న సినిమాలోను కథానాయికగా నటించనుంది. యంగ్ హీరో ఆది సాయికుమార్ చేస్తున్న అమరన్ సినిమాలోను ఆమెనే హీరోయిన్. ఇక చేతిలో మూడు సినిమాలతో ఈ తార ఫుల్ బిజీగా ఉంది.