టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అంటే అందరికి ఇష్టమే.. ఆయన నటన డాన్సులు అంటే చాలా మందికి ఇష్టం, ఇప్పుడు ఉన్న చాలా మంది యంగ్ హీరోలకి ఆయనే ఓ ఇన్స్ పిరేషన్, అయితే ఆయన
సినిమా పరిశ్రమకు వచ్చి 42 సంవత్సరాలు పూర్తైంది. కొణిదెల శివ శంకర వరప్రసాద్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. అపై చిరంజీవిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేశారు.
ఆయన పేరు మీద అనేక రికార్డులు నమోదు అయ్యాయి, ఆయన నటించిన మొదటి సినిమా ప్రాణంఖరీదు సెప్టెంబర్ 22న 1978 లో ఈ చిత్రం రిలీజ్ అయింది. కే వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని క్రాంతి కుమార్ తెరకెక్కించారు.
జయసుధ హీరోయిన్ గా నటించింది. రావు గోపాల్ రావు, కైకాల సత్యనారాయణ, చంద్రమోహన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.ఇది సూపర్ సక్సెస్ అయింది, ఇక మద్రాసు వచ్చిన మెగాస్టార్ అక్కడే యాక్టింగ్ స్కూల్లో చేరి నటననేర్చుకున్నారు, అక్కడ నుంచి పలు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి అయితే మరి ఆయన తొలి సినిమాకి వచ్చిన పారితోషికం తెలుసా? మొదటి సినిమాకి అక్షరాల 1,116 రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నారు చిరంజీవి.