చిరంజీవి ఆరోజు కోపంతో గన్ తీశారు- సంచలన విషయం చెప్పిన సుహాసిని

చిరంజీవి ఆరోజు కోపంతో గన్ తీశారు- సంచలన విషయం చెప్పిన సుహాసిని

0
127

మెగాస్టార్ చిరంజీవి ఆయన సినిమాలు అంటే నచ్చిన వారు ఉండరు, అద్బుతమైన హీరో, ఆయన డ్యాన్స్ అంటే ఇప్పటీకి అందరికి ఇష్టమే, అయితే ఎందరో దర్శకులు నటులు చిరంజీవితో సినిమా చేయాలి అని చూస్తారు, ఇక హీరోయిన్స్ కూడా అంతే చిరుతో సినిమా అంటే ఎస్ చెబుతారు.

అయితే ఆయన నిజ జీవితంలో కూడా మెగాస్టార్ అనే చెప్పాలి, ఎవరు సాయం అని అడిగినా ఆయన చేస్తారు, బ్లడ్ బ్యాంక్ ద్వారా కొన్ని వేల మందికి రక్తదానం చేయించారు, ఇలా గొప్ప హీరోగా ఆయన టాలీవుడ్ లో ఉన్నారు.మెగాస్టార్ చిరంజీవి తెరపై మాత్రమే హీరో కాదని… నిజ జీవితంలో కూడా హీరోనే అని సీనియర్ నటి సుహాసిని అన్నారు.

తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సుహాసిని మాట్లాడుతూ గతంలో జరిగిన ఓ ఘటనను గుర్తుకు తెచ్చుకున్నారు.ఓ షూటింగ్ కోసం అప్పట్లో కేరళకు వెళ్లాం. నేను, చిరంజీవి కారులో వెళ్తున్నాం. అప్పుడు తప్పతాగి ఉన్న కొందరు మేము వెళ్తున్న కారును ఆపారు. కారు మీదకు బీరు సీసాలను విసిరారు. దాంతో, చిరంజీవికి కోపం వచ్చింది. వెంటనే వారిని వారించారు, ఆ తర్వాత లైసెన్సుడు రివాల్వర్ ను తీసి వాళ్లను భయపెట్టారు. దీంతో తాగుబోతులు భయంతో అక్కడి నుంచి పారిపోయారు అని సుహాసిని తెలిపారు. ఆయన సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో అని అన్నారు.