చిరంజీవి అభిమానులకి ఆరోజు సర్ ఫ్రైజ్ ఏంటంటే ?

చిరంజీవి అభిమానులకి ఆరోజు సర్ ఫ్రైజ్ ఏంటంటే ?

0
91

మెగాస్టార్ చిరంజీవి చిత్ర సీమలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో, అయితే చిరంజీవి తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నారు, ఇది పూర్తిగా సోషల్ మెసేజ్ ఇచ్చే చిత్రం.

ఇక శరవేగంగా చిత్ర షూటింగ్ ప్రారంభం అయింది. దాదాపు 50 శాతం షూటింగ్ చేశారు, ఈ కరోనా వల్ల షూటింగుకి నాలుగు నెలలుగా బ్రేకులు పడ్డాయి, మరో నెల వరకూ సెట్స్ పైకి వెళ్లే అవకాశం లేదు అని తెలుస్తోంది.

ఈప్రాజెక్ట్ టైటిల్, చిరు లుక్ కోసం అభిమానులు కొన్నాళ్ళుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఆగస్ట్ 22న చిరంజీవి బర్త్డే. ఆ రోజు మెగా అభిమానులకి పండుగే, అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అభిమానులు, ఈ సమయంలో కచ్చితంగా ఆగస్ట్ 22 న ఆయన చిత్ర టైటిల్,ఫస్ట్ లుక్ తో అభిమానులని
ఆచార్య టీం సర్ప్రైజ్ చేయాలని ఆలోచన చేస్తున్నారట, టాలీవుడ్ లో ఈ వార్తలు వినిపిస్తున్నాయి.