మెగాస్టార్ పుట్టిన రోజున బిగ్ న్యూస్

మెగాస్టార్ పుట్టిన రోజున బిగ్ న్యూస్

0
78

చిరు కొరటాల సినిమా గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి, ఇక ఈ సినిమాలో చరణ్ బన్నీ నటిస్తారు అని వార్తలు వచ్చాయి.. కాని ఇప్పుడు మహేష్ బాబుని ఈ చిత్రంలో తీసుకున్నారు అని తెలుస్తోంది, అంతేకాదు తెలుగు రాష్ట్రాలలో సౌత్ ఇండియాలో చిరు మార్కెట్ చాలా ఉంది.. ఇక మహేష్ బాబు కూడా ఈసినిమాలో మరో కీలక పాత్రలో చేస్తున్నారు అనే సరికి ఇటు ప్రిన్స్ అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు ఎలాంటి వార్త వస్తుందా అని..

అయితే ఈ సినిమా గురించి ఎలాంటి ప్రకటన బయటకు రావడం లేదు.. టైటిల్ గురించి కూడా ఏ వార్త వినిపించడం లేదు..
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం కొరటాల కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిరుతో చిత్రీకరిస్తున్నారు.

ఇక ఈ చిత్రం అనుకున్నట్లు ఆగస్టులో విడుదల చేస్తారట, అయితే ముందు ఈ చిత్రం దసరా రోజు విడుదల చేస్తారు అని వార్తలు వచ్చాయి… కాని చిత్రం షూటింగ్ వేగంగా పూర్తి చేసి ఆగష్టులో విడుదల చేయాలి అని కొరటాల చూస్తున్నారు.. మే చివరినాటికి షూటింగును పూర్తి చేసి, ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ పనులను చేయనున్నారట. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం మెగాస్టార్ పుట్టిన రోజు ఆగస్టు 22 ఆరోజు చిత్రం విడుదల జరుగుతుంది అంటున్నారు.