చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ అప్‌డేట్..నయనతార షెడ్యూల్ పూర్తి

0
113

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా కంప్లీట్ చేసారు. ఈ సినిమాలో తొలిసారి పూర్తి స్థాయిలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించబోతున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 29న  విడుదల చేయనున్నారు.

చిరంజీవి  ఆచార్య’ తర్వాత ‘లూసీఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ స్టార్ట్ చేసారు. ఈ సినిమా ఓ షెడ్యూల్ ఊటీలో పూర్తైయింది.  తాజాగా ఈ సినిమాకు నయనతారకు సంబంధించిన షెడ్యూల్ పూర్తైయినట్టు చిత్ర దర్శకుడు మోహన్ రాజా తెలిపారు. నయనతారకు తనకు ఇది మూడో చిత్రమని పేర్కొన్నారు.

ఈ సినిమాలో నయనతార చిరంజీవి చెల్లెలు పాత్రలో నటిస్తోంది. ఇక మోహన్‌లాల్ ఒరిజినల్ ‘లూసీఫర్’ లో హీరోయిన్ లేదు. మరి తెలుగులో చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టు కథానాయికగా రోల్ ఉంటుందా లేదా అనేది చూడాలి. ‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత చిరంజీవి, నయనతార మరోసారి ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఇక సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలో సల్మాన్ ఖాన్‌కు సంబంధించిన షూట్ త్వరలోనే చేయనున్నారు.

https://twitter.com/jayam_mohanraja?