రామ్ చరణ్ సినిమాలో మెగాస్టార్

రామ్ చరణ్ సినిమాలో మెగాస్టార్

0
140

చిరంజీవి “సైరా” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్లో భాగంగా రామ్ చరణ్ అనేక మార్లు షూటింగ్ స్పాట్స్ వచ్చాడు. అయితే తాజాగా రామ్ చరణ్ సినిమా షూటింగ్ స్పాట్ కి మెగాస్టార్ చిరంజీవి వచ్చాడు. ఇప్పుడు రామ్ చరణ్ అజర్బేజాన్ లో ఉన్నాడు. అక్కడ జరుగుతున్నా షూటింగ్ ను చూసేందుకు వచ్చిన చిరంజీవి తో దిగిన ఫోటోను పోస్ట్ చేసారు.

మా సినిమా సెట్స్ పైకి వచ్చినందుకు “మెగాస్టార్ చిరంజీవి చాలా సంతోషమని చెప్పారు చిత్ర యూనిట్ . ఈ సందర్భంగా చిరు – దానయ్యలు ఉన్న ఫోటోను పోస్ట్ చేసారు.బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కు సరసన కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేసేందుకు నిర్మాత డివివి దానయ్య ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఎన్టీఆర్ బయోపిక్ మరియు రామ్ చరణ్ మూవీలు సంక్రాంతి బరిలో ఉన్నాయి.