చిరుతో మారుతి సినిమా టాలీవుడ్ టాక్ ?

Chiranjeevi movie with director maruthi

0
106

టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకుడు మారుతి. చిన్న సినిమాలతో కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా యూత్ కి కనెక్ట్ అయ్యే సినిమాలు చేస్తున్నారు ఆయన. కామెడీని మిక్స్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు వచ్చేలా చేశాడు. హీరో నాని, శర్వానంద్ లతో సూపర్ హిట్ లు తీశారు. ఇక వెంకటేష్ తో కూడా సినిమా చేశారు.

తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం. మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నారట. చిరంజీవిని దృష్టిలో పెట్టుకుని ఆయన మూడు కథలను సిద్ధం చేసుకున్నారట. ఇప్పటికే ఆయనకు స్టోరీ వినిపించారని ఈ కథ కూడా మెగాస్టార్ కి నచ్చింది అనే వార్తలు వినిపిస్తున్నాయి.

దర్శకుడు మారుతికి గీతా ఆర్ట్స్ తో మంచి సాన్నిహిత్యం ఉంది. అందువలన అల్లు అరవింద్ ద్వారా ఆయన చిరంజీవికి కథ చెప్పినట్టుగా తెలుస్తోంది. అన్నీ సెట్ అయితే ఈ సినిమా అల్లు అరవింద్ నిర్మాతగా తెరకెక్కించే అవకాశం ఉంది అంటున్నారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ వరుస సినిమాలతో మరో ఏడాది వరకూ ఫుల్ బిజీగా ఉన్నారు ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కవచ్చు అంటున్నారు. ఈ సినిమా పై అఫీషియల్ ప్రకటన వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే.