చిరంజీవికి మరో డ్రీమ్ ఉందట..!!

చిరంజీవికి మరో డ్రీమ్ ఉందట..!!

0
119

సై రా సినిమా తో సూపర్ హిట్ కొట్టిన చిరు తన తదుపరి చిత్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.. అయన 12 ఏళ్ల కోరిక ఈరోజుతో తీరింది. ఉయ్యాలా నరసింహ రెడ్డి పాత్రలో చేయాలనీ..ఆ పాత్ర తో ప్రేక్షకుల ముందుకు రావాలని కలలు కన్నాడు. ఆ కలలు రామ్ చరణ్ , సురేందర్ రెడ్డి వల్ల తీరింది.

అయితే మరో కల చిరు జీవితంలో ఉందట..ఈ విషయం చిత్ర ప్రమోషన్లలో తెలిపారు.చాలా కాలంగా ఎదురు చూసిన ఉయ్యాలవాడ పాత్ర చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. చరణ్ నా డ్రీమ్ రోల్ ను నెరవేర్చాడంటూ చెప్పుకొచ్చాడు.

అదే సమయంలో తన మరో డ్రీమ్ రోల్ అయిన భగత్ సింగ్ గురించి మాట్లాడుతూ ఇక నావల్ల కాదని.. మళ్లీ అలాంటి పాత్రలు సినిమాలు చేయలేక పోవచ్చు అంటూ తేల్చి చెప్పాడు. నేను చేయాలనుకున్న భగత్ సింగ్ పాత్రను చరణ్ చేస్తూ చూడాలని ఆశగా ఉందని చిరు చెప్పుకొచ్చాడు. మరి చిరు కోరికను చరణ్ ఎప్పుడు తీరుస్తాడో చూడాలి.