పాత దర్శకుడితో చిరు సరికొత్త సినిమా ?

పాత దర్శకుడితో చిరు సరికొత్త సినిమా ?

0
78

మెగాస్టార్ తో సినిమా అంటే ఏ దర్శకుడు అయినా ఒకే చెబుతారు, అంతేకాదు బాస్ తో సినిమా అంటే కచ్చితంగా రికార్డులు బద్దలు అవుతాయి ,నిర్మాతలు కూడా చిత్రాలు చేసేందుకు రెడీ అంటారు, అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రం చేస్తున్నారు, ఈ సినిమా తర్వాత ఇక ఆయన మరో చిత్రం చేయనున్నారు.

అదే లూసీఫర్ ..ఇప్పటికే మోహన్ లాల్ హీరోగా మలయాళంలో వచ్చిన హిట్ సినిమా తెలుగులో చిరు చేయనున్నారు. ముందుగా సాహో ఫేం సుజీత్ దీనికి దర్శకత్వం వహిస్తున్నట్టు గత కొంత కాలంగా వార్తలొస్తున్నాయి. అయితే, ఇప్పుడు ఉన్నట్టుండి దర్శకుడిని మారుస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

అయితే కధలో ఇంకా మార్పులు కోరుతున్నారట చిరు.. అందుకే మరో దర్శకుడికి ఛాన్స్ అంటూ సినీ సర్కిళ్లలో వార్తలు వినిపిస్తున్నాయి, వాస్తవంగా ఇంకా మెగా ఫ్యామిలీ అలాగే చిత్ర యూనిట్ నుంచి దీనిపై ప్రకటన లేదు, అయితే వివి వినాయక్ కు ఛాన్స్ఇ స్తారు అని వార్తలు వస్తున్నాయి, మరి చూడాలి దీనిపై ఏదైనా ఓ ప్రకటన వారి నుంచి వచ్చే వరకూ ఇది రూమర్ గానే ఉంటుంది.