Chiranjeevi Oscars |ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. రాజమౌళి ధైర్యం, దార్శనికతతోనే ఈ అద్భుతం సాకారమైందని చిరంజీవి వ్యాఖ్యానించారు. నాటు నాటు ప్రపంచ శిఖరాగ్రాన నిలిచిందని అన్నారు. రాజమౌళి బృందానికి అభినందనలు తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్.. వంద కోట్ల హృదయాలను గర్వపడేలా చేసిందని వెల్లడించారు. ప్రపంచ వేదికపై తెలుగు సినిమా కీర్తిని వెలుగెత్తి చాటారన్నారు. ప్రపంచస్థాయిలో తెలుగు సినిమా స్థాయిని నిరూపించింది. ఆస్కార్ వేడుకలలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయిన నాటు నాటు పాట ఆస్కార్ కైవసం చేసుకుంది. ఈ సందర్బంగా చిత్రయూనిట్‌కు చిరు అభినందలు తెలిపారు.
- Advertisement -
Read Also: RRR కు ఆస్కార్.. అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన తెలుగు సినిమా
Follow us on: Google News