చిరంజీవికి మరో అరుదైన అవార్డు.. ఎందుకో తెలుసా..!

-

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) మరో అరుదైన అవార్డు అందుకున్నారు. కొన్ని రోజుల క్రితమే తన సినీ కెరీర్‌లో 24వేల డ్యాన్స్ మూవ్స్ వేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నుంచి గుర్తింపు అందుకున్నాడు చిరంజీవి. దాంతో పాటుగా ది మోస్ట్ ప్రొఫైలిక్ మూవీ స్టార్‌గా కూడా గుర్తింపు పొందాడు. ఇప్పుడు తాజాగా మరో అరుదైన అవార్డును కైవసం చేసుకున్నారు. అబుదాబి వేదికగా అంగరంగ వైభవంగా జరుగుతున్న IIFA అవార్డ్స్ ఫంక్షన్‌లో ఈ అవార్డు చిరు సొంతమైంది. సినీ ఇండస్ట్రీకి IIFA ఎంత స్పెషలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఈవెంట్ రెండు రోజులుగా జరుగుతుంది. ఇందులో తాజాగా బాలకృష్ణ, సమంత, రాణా, ఏఆర్ రెహ్మాన్, వెంకటేష్ కూడా పాల్గొని అందరినీ అలరించారు. ఇందులో చిరంజీవి కూడా పాల్గొని అవార్డును సొంతం చేసుకున్నారు.

- Advertisement -

ఈ ఈవెంట్ సందర్భంగా ఐఫా యాజమాన్యం చిరంజీవికి(Chiranjeevi) ‘ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా’ పురస్కారాన్ని అందించింది. సినీ హీరోగా తన స్టెప్పులతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అందుకున్న ఏకైక ఇండియన్ హీరోగా చిరంజీవి నిలిచారు. ఇటువంటి ఫీట్ ఇప్పటివరకు మరెవరూ అందుకోకపోవడం వల్లే ఇప్పుడు చిరు పేరిట ఔట్ స్టాండింగ్ అవార్డ్‌ కూడా నిలిచింది. ఇదిలా ఉంటే ఈ ఈవెంట్ నేపథ్యంలో ఉమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సమంత సొంతం చేసుకుంది. అంతేకాకుండా మరెందరో ఈ ఈవెంట్‌లో అవార్డులను అందుకున్నారు.

Read Also: లైంగిక స్టామినా పెరగాలంటే పురుషులు ఇవి మానుకోవాల్సిందే..!
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ గెలుపుకి ప్రాంతీయ పార్టీలే కారణం: కేటీఆర్

మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి సాధించిన ఘన విజయంపై బీఆర్ఎస్ వర్కింగ్...

KTR | ‘కాంగ్రెస్ ఓటమికి రేవంత్ తప్పుడు ప్రచారమే కారణం’

మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR).....