చిరంజీవి అల్లుడు రెండో చిత్రం టైటిల్ ఇదే

చిరంజీవి అల్లుడు రెండో చిత్రం టైటిల్ ఇదే

0
86

మెగా కుటుంబం నుంచి చిత్ర సీమకు చాలా మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు, అయితే ఆయన చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే… ఆయన విజేత సినిమాలో నటించారు ..మరి ఆ సినిమా ఓ మోస్తరు ఆడింది.

అయితే తాజాగా క‌ల్యాణ్‌దేవ్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం సూప‌ర్‌మ‌చ్చి.. అయితే ఇక్కడ మరో విషయం కూడా ఉంది..రెండో చిత్రంతోనే క‌ల్యాణ్‌దేవ్ క‌న్న‌డ నాట కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సూప‌ర్‌మ‌చ్చి తెలుగుతో పాటు క‌న్న‌డ‌లో కూడా విడుద‌ల‌వుతుంది. అయితే ఈ సినిమాకి కన్నడలో టైటిల్ కూడా ఫిక్స్ అయింది.

అదే మీనాక్షి.. అయితే జ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రిజ్వాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. పులివాసు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేసే అవ‌కాశాలన్నాయ‌ని తెలుస్తోంది, అయితే ఈ సినిమాతో పాటు మరో క్రేజీ కాన్సెప్ట్ కూడా విన్నారట దేవ్ ..తాజాగా ఆయన మరో క్రేజీ సినిమాని ఒకే చేశారు.. కథలో కొన్ని మార్పులు ఉన్నాయట. అది కూడా సమ్మర్ లో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయట.