ఒకే సినిమాలో చిరు, రవితేజ..22 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా..!

0
108

మెగాస్టార్‌ చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ ఫుల్‌ జోష్ లో ఉన్నారు. ఈ ఏడాది చిరు తన సినిమాలతో అభిమానులకు మాస్‌ ఫీస్ట్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. చిరు, రామ్‌ చరణ్‌తో కలిసి నటించిన ‘ఆచార్య’ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.  కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

దీంతోపాటు గాడ్ ఫాదర్‌, భోళా శంకర్‌, బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు చిరంజీవి. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్‌ను పరిశీలిస్తోందట చిత్రబృందం. వైజాగ్‌ షిప్‌ యార్డ్ నేపథ్యంలో మాస్‌ యాక్షన్‌ మూవీగా తెరకెక్కనుందని సమాచారం.

అయితే ఈ చిత్రంలో మాస్ మహారాజ రవితేజ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో చిరంజీవికి తమ్ముడిగా రవితేజ అలరించనున్నాడని సమాచారం. రవితేజ పాత్ర సుమారు 40 నిమిషాలు ఉంటుందని పుకార్లు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే సుమారు 22 ఏళ్ల తర్వాత చిరు, రవితేజ కలిసి మరోసారి అన్నదమ్ముల పాత్రలో అలరించున్నారు. 2000 సంవత్సరంలో వచ్చిన బ్లాక్ బస్టర్‌ చిత్రం’అన్నయ్య’లో చిరంజీవి, రవితేజ, వెంకట్‌ అన్నదమ్ములుగా యాక్ట్ చేసిన విషయం తెలిసిందే.