నా జీవితంలో వీరయ్యని మర్చిపోలేను – మెగాస్టార్

నా జీవితంలో వీరయ్యని మర్చిపోలేను - మెగాస్టార్

0
91

మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారు ఉండరు సినిమాల్లో ఎంతో కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిగా ఆయనకు పేరు ఉంది. తాజాగా టీవీ9 నవ నక్షత్ర సన్మానం 2019 కార్యక్రమంలో పాల్గొన్న చిరు ఓ ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. తన తండ్రికి ఎస్ఐగా ప్రమోషన్ రావడంతో చీరాల బదిలీ అయిందని, దాంతో తమ కుటుంబం కూడా చీరాలలో కొంతకాలం ఉందని తెలిపారు. ఆ సమయంలో డిగ్రీ అయిన తర్వాత ఏం చేయాలో తెలియని సమయంలో.

తన తండ్రి దగ్గర పని చేసే వీరయ్య నువ్వు సినిమా హీరోలా ఉంటావు మద్రాస్ వెళ్లి సినిమాలకు ట్రై చెయ్ అని ప్రొత్సహించాడని అంతేకాదని తనని ఫోటో షూట్ కు తీసుకువెళ్లి ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కు ఫోటోలు పంపేలా చేశాడని, వీరయ్య అనే కానిస్టేబుల్ అందించిన ప్రోత్సాహం మరువలేనని అన్నారు చిరంజీవి.

నన్ను చూసి నీ పర్సనాలిటీ చూడు శత్రుఘ్న సిన్హాలా ఉంటావు అన్నాడు. శత్రుఘ్న సిన్హా కూడా ఫిలిం ఇన్ స్టిట్యూట్ లో చేరిన తర్వాతే నటుడయ్యాడని చెప్పాడు.నువ్వు కూడా అలా అవుతావు అని చెప్పాడని, అతనిని జీవితంలో మర్చిపోలేను అని చెప్పారు చిరు, మెగాస్టార్ ఈ మాట చెప్పడంతో అందరూ గ్రేట్ వీరయ్య అంటున్నారు.