చూడాలని ఉంది ఈ సినిమా మెగా అభిమానులు అందరికి నచ్చిన సినిమా..ఈ సినిమాలో చిరు నటన అద్బుతం అనే చెప్పాలి 100 డేస్ ఆడిన చిత్రం ఇది. అనేక సెంటర్లలో రికార్డులు నమోదు చేసింది. భారీ వసూళ్లు తీసుకువచ్చింది, ఈ చిత్రం లో సాంగ్స్ హైలెట్ .
ఈ సినిమాలో కోల్ కతా నగర నేపథ్యం కనిపిస్తుంది. అందులో ఆ నగరం విశిష్టతను తెలుపుతూ చిరంజీవిపై ఏకంగా ఓ పాట కూడా ఉంటుంది. అయితే తాజాగా చిరు మళ్లీ బెంగాల్ లోని కోల్ కతా నగరం నేపథ్యంలో ఓ చిత్రం చేయనున్నారు అని తెలుస్తోంది, ఆచార్య సినిమా పూర్తి అయిన తర్వాత వేదాళం చిత్రం చేయనున్నారు, దీనికి దర్శకుడు మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రంలో కోల్ కతా నగర నేపథ్యం వుంటుందట. చిత్రం షూటింగులో కొంత భాగాన్ని అక్కడ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇటీవల దసరాకి సంబంధించి కొన్ని షాట్స్ అక్కడ షూటింగ్ చేశారు అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో కొన్నిసీన్స్ లో గుండుతో కనిపిస్తారట చిరు. అందుకే ఇది వరకు ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి అని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.