చిరుకి నో చెప్పిన త్రిష ఇప్పుడు ఎవరితో సినిమా చేస్తోందంటే

చిరుకి నో చెప్పిన త్రిష ఇప్పుడు ఎవరితో సినిమా చేస్తోందంటే

0
93

చిరంజీవితో సినిమా అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు, ఆయనతో సినిమా అంటే అది కచ్చితంగా హిట్ కాబట్టి మనకి హిట్ పడుతుంది అని భావిస్తారు.. అందుకే ఏ భామ అయినా చిరుతో సినిమా అంటే ఎస్ చెబుతుంది.. కాని తాజాగా కొరటాల చిరు సినిమా ఆచార్యకు మాత్రం త్రిష షాక్ ఇచ్చింది, ముందు అనుకున్న విధంగా చిత్రంలో చేస్తాను అన్న త్రిష్ తర్వాత సినిమా యూనిట్ కు గుడ్ బై చెప్పింది.

క్రియేటివ్ ఢిఫరెన్స్ కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు త్రిష తెలిపారు.అయితే ఆచార్య సినిమా నుంచి తప్పుకొన్న త్రిష.. రవితేజ సినిమాకి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది, అయితే ఇప్పుడు దీని గురించి టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు.

ఇప్పుడు క్రాక్ సినిమా చేస్తోన్న రవితేజ్ తన తర్వాతి సినిమా రమేశ్ వర్మతో చేయనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషను ఇప్పటికే సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక వచ్చే నెలలో ఈ సినిమాలో ఆమె డేట్స్ కూడా ఇస్తుంది అని తెలుస్తోంది.