చిరు కోసం 20 కోట్లు ఖర్చు చేశారు ఎందుకంటే

చిరు కోసం 20 కోట్లు ఖర్చు చేశారు ఎందుకంటే

0
92

కొరటాల శివ కాస్త సమయం తీసుకున్నా మెగాస్టార్ చిరంజీవి సినిమాకి మంచి ప్లాన్ తో వెళుతున్నారు.. లుక్ లో కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు.. ఇక ఈ సినిమా పై అభిమానులు అంచనాలు పెంచుకున్నారు, ఇక ఈ చిత్రంలో చరణ్ కూడా చిరు చిన్నతనంలో పాత్ర పోషిస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి, అయితే సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.

వంద రోజుల్లో చిరంజీవితో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలి అని భావిస్తున్నారు చిత్రయూనిట్..ఈ సినిమా కోసం హైదరాబాద్ – కోకాపేట్ లో, ఓ దేవాలయంతో కూడిన కాలనీ సెట్ వేశారు. ఈ ఒక్క సెట్ కోసమే 20 కోట్ల వరకూ ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా ఇది సైరా కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారా అనే అనుమానం అభిమానులకి కలుగుతోంది.

ఇందులో హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. విలన్ గ్యాంగ్ ను చిరంజీవి తనదైన స్టైల్లో రఫ్ ఆడించే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక సినిమాకి ఇది చాలా హైలెట్ సీన్ అని తెలుస్తోంది .. దేవాలయ భూముల ఆక్రమణ .. ఆ వైపు నుంచి జరుగుతున్న అవినీతికి సంబంధించిన అంశాలతో ఈ కథను తయారు చేసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక చిరు సరసన త్రిష ఇందులో కనిపించనున్నారు.