చిరు మ‌రో కొత్త సినిమా ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే?

చిరు మ‌రో కొత్త సినిమా ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే?

0
129

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం ఆచార్య సినిమా చేస్తున్నారు, ఈ సినిమా త‌ర్వాత ఆయ‌న
లూసిఫ‌ర్ చేయ‌నున్నారు, ఇక ఆయ‌న వివి వినాయ‌క్ బాబీతో కూడా చిత్రాలు చేయ‌నున్నారు స్టోరీ డిస్క‌ష‌న్స్ న‌డుస్తున్నాయి.

ఈ స‌మ‌యంలో చిరు మ‌రో చిత్రం చేయ‌నున్నారు అని వార్త వినిపిస్తోంది…మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో ఓ తమిళ సినిమా రీమేక్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. త‌మిళ స్టార్ హీరో అజిత్‌ నటించిన వెదాళం అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ చిత్రాన్ని చిరంజీవి లేదా పవన్‌ కల్యాణ్‌తో రీమేక్‌ చేయనున్నారని గతంలో వార్తలు కూడా వచ్చాయి.

ఈ సినిమా ద‌ర్శ‌కుడు మెహర్‌ రమేశ్ తెర‌కెక్కిస్తారు అని వార్త‌లు వ‌స్తున్నాయి,అనిల్‌ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాతగా వ్యవహరించనున్నారని టాక్ న‌డుస్తోంది..ఈ నెల 22న చిరు పుట్టిన రోజు దీనిపై ఆరోజు ప్ర‌క‌ట‌న వ‌స్తుందేమో చూడాలి. టాలీవుడ్ లో ఈ సినిమా గురించి టాక్ న‌డుస్తోంది. మ‌రి అధికారిక ప్ర‌క‌ట‌న గురించి చూడాలి.