చిరు మోహన్ బాబు పై మంచు మనోజ్ సూపర్ కామెంట్

చిరు మోహన్ బాబు పై మంచు మనోజ్ సూపర్ కామెంట్

0
98

సినిమా ఇండస్ట్రీలో మంచి పోటీ వాతావరణం ఉంటేనే ఇటు అభిమానులు కూడా సినిమాలని ఎంజాయ్ చేస్తారు, అయితే మెగా స్టార్ చిరంజీవి మంచు మోహన్ బాబు ఎంతో మంచి మిత్రులు.. సినిమాల్లో మాత్రం ఇద్దరు చాలా పోటీ పడతారు, కాని ఏ సమస్య వచ్చినా ఒకరిని ఒకరు పలకరించుకోవడం సాయం తీసుకోవడంలో ముందు ఉంటారు.

ఇక చిరు కూడా మోహన్ బాబుపై పలుసార్లు సరదా కామెంట్లు చేస్తారు, తాజాగా మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీనియర్ నటులు చిరంజీవి, మోహన్ బాబు మధ్య చోటుచేసుకున్న ఆత్మీయ సన్నివేశం అందరికి ఆకట్టుకుంది.. మేము మంచి మిత్రులం మా ఇద్దరిది ఒకే కుటుంబం అని మా మధ్య విభేదాలు లేవు అని మోహన్ బాబు అనగానే చిరంజీవి ఆయనని ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకున్నారు.

ఈ ఆత్మీయ సన్నివేశాన్ని మంచు మనోజ్ ఫొటోల రూపంలో పోస్టు చేశారు. తాము ఎప్పుడు కలుసుకున్నా సినీ అమ్మ ముద్దుబిడ్డలు అంటూ పేర్కొన్న మనోజ్, 2020 ఆరంభానికి ఇదే బెస్ట్ ఫొటో అంటూ వ్యాఖ్యానించారు. దీనిని మెగా మంచు ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.